ఈ నెల 21న దివ్యాంగుల ధర్నా
హైదరాబాద్, జనవరి 10, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ( డీఎస్‌డి ) ఆధ్వర్యంలో ఈ నెల 21న ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో– కన్వీనర్ కాటమోని వెంకటేష్ గౌడ్ లు తెలిపారు. ఈ మేరకు శనివారం శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాల యం వద్ద మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అవుతున్నా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. దివ్యాంగుల వృద్ధులకు పెన్షన్ ఇవ్వకపోతే వారు ఎలా జీవించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, దివ్యాంగుల వృద్ధులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచి పెన్షన్ ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు టిజిఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని, ఉద్యోగాల క్యాలెండర్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసి, భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌పిడబ్ల్యుడి యాక్ట్-2016ను పటిష్టంగా అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కేటాయించి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న నిర్వహించే దివ్యాంగుల మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.













Leave a Reply