Saturday, September 19, 2026
No menu items!
Homeక్రైమ్రైలు ఢీకొని డాక్టర్ మృతి

రైలు ఢీకొని డాక్టర్ మృతి

📰 Generate e-Paper Clip

 

అంబ‌ర్‌పేట్‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :    సంపర్క్‌ క్రాంతి రైలు ఢీకొని ఓ డాక్టర్ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేష‌న్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్ట‌ర్ ఎల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ చిమ్నా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. చంచల్ గూడ ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ అలీ కుమార్తె అలీషా (26) వృత్తిరీత్యా డాక్టర్. శుక్రవారం విధుల నిమిత్తం కాచిగూడకు రావడానికి మలక్‌పేట్ రైల్వేస్టేష‌న్ రెండో ప్లాట్ ఫామ్ నుంచి ఒకటవ ప్లాట్ ఫారానికి రావడానికి పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వ‌స్తున్న కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలు ఢీకొనడంతో అలీషా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page