దోమలగూడ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి
– బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 14, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ నుంచి విడదీసి దోమలగూడను డివిజన్‌ను ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన ” అద్దం న్యూస్ ” ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ… గతంలో దోమలగూడకు ప్రత్యేక వార్డు ఉన్నప్పటికీ, జిహెచ్ఎంసి విభజనల్లో డివిజన్ పేరును తొలగించడంతో ప్రాంతం గుర్తింపు కోల్పోయిందన్నారు. కవాడిగూడ డివిజన్‌లో దోమలగూడను విలీనం చేశారన్నారు. దోమలగూడ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేటర్ లేకుండా చేశారన్నారు. చారిత్రక నేపథ్యంతో ఉన్న దోమలగూడ జిహెచ్ఎంసి వార్డు నెం.95 గా కొనసాగుతోందన్నారు. హుస్సేన్ సాగర్ దక్షిణాన, ఇందిరాపార్క్ సమీపంలోని ఈ ప్రాంతంలో రామకృష్ణ మఠం, ఆంధ్ర విద్యాలయ కాలేజీ, నిజాం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయం వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయన్నారు. ఇక్కడ దోమలగూడ వార్డు ఆఫీసు, రెండు ప్రభుత్వ పాఠశాలలు, నిజాం కాలంలో నిర్మించిన పాత మార్కెట్ వంటి మౌలిక సదుపాయాలు ప్రస్తుతం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంగా మార్పు చెందిందన్నారు. దోమలగూడకు ఉన్న చారిత్రక, భౌగోళిక, పరిపాలనా ప్రాముఖ్యత దృష్ట్యా ప్రత్యేక డివిజన్ ఏర్పాటు తప్పనిసరి అని, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది అత్యవసరమని రాజశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో మూడు డివిజన్లను కొత్తగా విభజించారని, కానీ అత్యధిక జనాభా ఉన్న కవాడిగూడ డివిజన్ నుంచి దోమలగూడను విడదీసి ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.![]()

![]()













Leave a Reply