గంటల వ్యవధిలోనే
హత్య కేసును ఛేదించిన దోమలగూడ పోలీసులు
హత్య చేసి పారిపోతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన దోమలగూడ పోలీసులు

నిందితుడి అరెస్ట్‌ను చూపిస్తు వివరాలను వెల్లడిస్తున్న డిసిపి శిల్పవల్లి
హైదరాబాద్, అద్దం న్యూస్ : హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిమాయత్‌నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిఫ్ట్ వద్ద ఓ గుంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఈ నెల 27వ తేదీన రాత్రి హత్య చేశారని 28వ తేదీ ఉదయం డయల్ 100కు ఫోన్ రావడంతో దోమలగూడ పోలీసులు ఘటనా స్థలానికి సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి, దోమలగూడ సిఐ శ్రీనివాస్‌రెడ్డి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం వద్ద క్లూస్ టీమ్‌తో ఆధారాలను సేకరించారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతంలో మృతుడు ఎవరు అనేది విచారించారు. అత్యంత దారుణంగా హత్య జరగడంతో ఈ కేసును దోమలగూడ పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఎట్టకేలకు 29వ తేదీన ఉదయం నిందితుడు హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుసుకున్న దోమలగూడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం దోమలగూడ పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య, హత్య చేసిన నిందితుడి తదితర వివరాలను డిసిపి శిల్పవల్లి వెల్లడించారు. సూర్యపేట శ్రీదేవి టాకీస్ ప్రాంతానికి చెందిన చేవూరి నరేందర్ ( 40 ) వృత్తిరిత్యా లేబర్ పని చేస్తుంటాడు. 2011లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అప్పటి నుంచి దోమలగూడ, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో ఫుట్‌ఫాత్‌లపై పడుకుంటూ చిన్న చిన్న నేరాలకు పాల్పడేవాడు. నిందితుడు నరేందర్ గతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసుతో పాటు, సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఒక ద్విచక్ర వాహన దొంగతనానికి పాల్పడ్డాడు. 2024లో చిక్కడపల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. 2025 మార్చి 4వ తేదీన చంచల్‌గూడ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలోనే హిమాయత్‌నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ఫుట్‌పాత్‌లపై ఉంటూ బిక్షాటన చేసే అజయ్‌తో నరేందర్‌కు పరిచయం ఏర్పడింది. బిక్షాటనలో అజయ్‌కు వస్తున్న డబ్బును చూసి అజయ్‌తో ఈ నెల 27వ తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో హిమాయత్‌నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫుట్‌పాత్ వద్ద అజయ్ అనే బిచ్చగాడితో నరేందర్ గొడవ పడ్డాడు. అంబర్‌పేట్ చెన్నారెడ్డినగర్‌కు చెందిన ఎడమ మురళీధర్ ( 53 ) హిమాయత్‌నగర్‌లోని జీ ప్లాజా బిల్డింగ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తుంటాడు. అజయ్‌తో నరేందర్ గొడవ పడుతున్నది చూసిన మురళీధర్ స్థానికంగా పాన్ షాప్ నడుపుతున్న శంకర్ లాల్‌తో కలిసి వారి దగ్గరకు వెళ్లి నరేందర్‌ను హెచ్చరించి వారిని అక్కడి నుండి పంపించివేసారు. ఆపై మురళీధర్ తన ఆఫీసు గదికి వెళ్లి పడుకున్నాడు. 28వ తేదీన ఉదయం తన కార్యాలయంలో ఉన్నప్పుడు, భవనం సెక్యూరిటీ గార్డు సంపతి వచ్చి పంజాబ్ నేషన్ బ్యాంక్ ఏటిఎం పక్కన ఉన్న లిఫ్ట్ కోసం తవ్విన గుంతలో నుదుటిపై గాయాలతో ఒక గుర్తు తెలియని వ్యక్తి రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నాడని తెలియజేశాడు. వెంటనే మురళీధర్, సంపతి ఇద్దరు కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి రక్తం మడుగులో ఉన్నది అజయ్ అని గుర్తించారు. దీంతో మురళీధర్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు మృతుడు ఎవరనేది తెలుసుకున్నారు. 27వ తేదీన రాత్రి అజయ్‌తో గొడవ పడిన వ్యక్తి అజయ్ తల పై బలంగా కొట్టి హత్య చేసి, మృతుడిని లిఫ్ట్ ప్రాంతం వద్ద ఉన్న గుంతలో విసిరివేసి ఉండవచ్చునని మురళీధర్ పోలీసులకు చెప్పాడు. మృతుడు అజయ్ 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, నల్లటి చొక్కా ధరించి, నగ్నంగా పడి ఉన్నాడని, కుడి చేతి పై స్వస్తిక్ గుర్తు పచ్చబొట్టు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అజయ్‌తో గొడవ పడిన వ్యక్తిని చూసిన వ్యక్తి మురళీధర్ కావడంతో ఆయన చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు 24 గంటల తర్వాత నిందితుడు నరేందర్‌ను దోమలగూడ పోలీసులు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి, మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సెంట్రల్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆనంద్, గాంధీనగర్ డివిజన్ ఏసిపి గురురాఘవేంద్ర, సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం, దోమలగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది అందరూ కలిసి నిందితుడిని పట్టుకునేందుకు పని చేశారని డిసిపి శిల్పవల్లి తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply