ఫ్లైట్‌లో ఈ 10 వస్తువులు తీసుకెళ్లకండి!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు తమ లగేజ్‌లో తీసుకెళ్తున్న వస్తువులపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని వస్తువులు విమాన భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. తాజాగా ఎయిర్‌లైన్స్ అధికారులు 10 వస్తువులను ఫ్లైట్‌లో క్యారీ చేయరాదని సూచించారు.

కొబ్బరికాయ, కేన్డ్ ఫుడ్ వంటివి అధిక పీడనం కారణంగా పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే కొబ్బరి ముక్కలు లేదా తురుము రూపంలో తీసుకెళ్లవచ్చు. అలాగే సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రోటీన్ పౌడర్, దురియన్ ఫ్రూట్ కూడా క్యారీ చేయరాదు. వీటి వల్ల దుర్వాసన లేదా రసాయన పరమైన ప్రమాదం ఏర్పడవచ్చు.

ఇక నిషేధిత రసాయనాలతో తయారయిన మందులు, గ్లో స్టిక్స్, టాయ్ వెపన్స్, స్నో గ్లోబ్‌లను కూడా తీసుకెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ భద్రతా ప్రమాణాలకు విరుద్ధమని తెలిపుతున్నారు. ప్రయాణానికి ముందు ఈ నియమాలను గుర్తు పెట్టుకుంటే ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇది మీ సామాను భద్రతకే కాకుండా ఇతర ప్రయాణికుల భద్రతకూ ఉపయోగపడుతుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page