Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADహోమియోపతి వైద్యంతో సర్వరోగ నివారణకు కృషి చేస్తున్న డాక్టర్ బసవానందం సేవలు అభినందనీయం

హోమియోపతి వైద్యంతో సర్వరోగ నివారణకు కృషి చేస్తున్న డాక్టర్ బసవానందం సేవలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

డాక్టర్ బసవానందం సేవలు అభినందనీయం
» రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 31, ( అద్దం న్యూస్ ) :   హోమియోపతి వైద్యంతో సర్వరోగ నివారణకు కృషి చేస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బసవానందం చేస్తున్న వైద్య సేవలు అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌.కె.ల‌క్ష్మణ్ పేర్కొన్నారు. హోమియోపతి వైద్య రంగంలో రాష్ట్రంలో పేరొందిన‌ ప్రముఖ వైద్యుడు డాక్టర్ దండేపు బసవానందం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం హైద‌రాబాద్‌ నగరంలోని చిక్కడపల్లి త్యాగ‌రాయ‌గాన స‌భ వీధిలో సోమవారం ఘ‌నంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై డాక్టర్ బసవానందం తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ల‌క్ష్మ‌ణ్‌ మాట్లాడుతూ… దేశంలో వైద్య రంగాన్ని విస్తరించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బీబీనగర్‌లో ఎయిమ్స్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేసి నిత్యం వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్నారని తెలిపారు.

ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఆయుర్వేద అభివృద్ధికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల‌ని సూచించారు. డాక్టర్ బసవానందం మాట్లాడుతూ… గత నాలుగు దశాబ్దాలుగా హోమియోపతి వైద్యం చేస్తూ వేలాది మందికి అనేక రకాల రోగాలను నయం చేసినట్లు తెలిపారు. హోమియోపతి వైద్యం పై ప్రజలు నమ్మకం పెట్టాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సిహెచ్ మదన్ రెడ్డి, బిఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జై సింహ, ప్రత్యేక ఆహ్వానితులుగా జేఎస్‌పిఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్.ఎన్.లింగరాజు, ఐహెచ్‌పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.చంద్రశేఖర రావు, ఐహెచ్‌పి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టరు మధు వారణాసి, ఐహెచ్‌పి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంఎన్.రాజు, బల్దిపూర్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ దత్తగిరి మహారాజ్ తదితరులు హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page