
బేషజాలాలకు వెళ్లకుండా దళితులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలి
– దసరా మిలాప్‌లో వక్తలు

హైదరాబాద్, అక్టోబర్ 12, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే దసరా మిలాప్ కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగింది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్టి క్వాటర్స్ కమ్యూనిటీహాల్లో జరిగిన ఈ దసరా మిలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎన్.శ్రీనివాస్‌రావు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ, ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు గండి క్రిష్ణ, గజ్జెల సూర్యనారాయణ, నర్మెట్ట మల్లేష్, కేశవపురం స్వామి, నందగిరి నర్సింహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్.బిఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. అలాగే దళిత ఐక్య వేదిక వ్యవస్థాపకులు దివంగత నాయకులు ఇటిక్యాల లింగం, రాజ్ కుమార్, గజ్జెల రుషికేశ్వర్, ఎంఆర్.దశరథ్, ఐడిఎల్.సత్యనారాయణ ల చిత్ర పటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎన్.శ్రీనివాస్‌రావు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ జి.రచన శ్రీ మాట్లాడుతూ… అన్నదమ్ముల్లాంటి దళితుల మధ్య రాజకీయ పార్టీల నాయకులు చిచ్చులు పెట్టి మన ఐక్యతను దెబ్బతీస్తున్నాయన్నారు. దళితులందరూ ఐక్యంగా ఉండాలంటే ఈగోలు, బేధ, విభేదాలను దూరం చేసుకోవాలన్నారు. దివంగత నేతలు ఇటిక్యాల లింగం, రాజ్ కుమార్ లు దూర ఆలోచనతో, మంచి ఉద్ధేశ్యంతో తెలంగాణ దళిత ఐక్య వేదికను ఏర్పాటు చేశారన్నారు. వారి ఆశయ సాధనలకు ప్రస్తుత దళిత ఐక్య వేదిక నాయకులందరూ కృషి చేయాలన్నారు.

రాజకీయ పార్టీలను మన వద్దకే వచ్చే విధంగా దళితులందరూ రాజకీయంగా ఎదగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర దళిత ఐక్య వేదిక సీనియర్ నాయకులు గజ్జెల సూర్యనారాయణ, జివై.గిరి ల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు జి.వెంకటేష్, ఆర్.జనార్థన్, వివేక్, శ్యామ్‌సుందర్, సిరిగిరి శ్యామ్, గడ్డం నవీన్, సదా, భాస్కర్, నర్సింగ్‌రావు, నీలమ్మ, సంపూర్ణ, శోభారాణి, సాలమ్మ, సంగపాక భాస్కర్, గడ్డం రమేష్, గోపాల్ దాస్, నవీన్, మేడి సురేష్, హరీష్, ఎర్రోళ్ల సతీష్, దళిత జర్నలిస్టులు కరుణాకర్ పాలమాకుల, వంగూరి గోపాల్ లతో పాటు పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply