ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 17, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని, ప్రస్తుతం కొత్త నినాదం ఎత్తుకొని బీసీల రిజర్వేషన్ల నినాదం ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అభినందించాం… కానీ విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిల మాటేమిటని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా ప్రశ్నించారు. బుధ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో సీఎం గాని, పీసీసీ ప్రెసిడెంట్ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎనిమిది వేల కోట్ల బకాయిలలో అత్యధికంగా అణగారిన వర్గాలు, బీసీలు ఎక్కువగా ఉంటారని, మరి వాళ్ళ భవిష్యత్తు మీకు ( ప్రభుత్వానికి ) ముఖ్యం కాదా అని అన్నారు. కాబట్టి ఇలాంటి జిమ్మికులతో ప్రజల్ని మరోసారి మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. మొన్నటిదాకా బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీ వరకు వెళ్లి నాటకమాడి ఇప్పుడు బీసీల రిజర్వేషన్ల నాటకం ముగిసిందని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక జాప్యం చేస్తుందని అన్నారు. ఇకనైనా పాలన మా వల్ల కాదని చేతులెత్తేసి వాయిదా వేసి, మరింత సమయం కావాలని ప్రభుత్వం అనడం వీరి నిజాయితిని, చిత్తశుద్దిని శంకించాల్సి వస్తుందన్నారు.  అంతే కాకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్లు మొదలైన నిధులు రాకపోగా 12 వందల కోట్ల స్థానిక సంస్థలకు రావలసిన గ్రాంట్లు రూపంలో రావలసినదంతా రాష్ట్రం నష్ట పోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. మరి ఇంకెంత కాలం స్థానిక సంస్థలు అధికారుల పాలనలో మగ్గిపోవాలని వాపోయారు. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమన్న మహాత్మాగాంధీ వారసులుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, ఈనాటికి కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతోందన్నారు.

గతంలో జరిగిన సిగాచీ ఫార్మాసూటికల్ ఉదంతంలో చనిపోయిన మృతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదన్నారు. అంగన్‌వాడి టీచర్లకు, ఉద్యోగులకు, పార్ట్ టైం లెక్చరర్లుగా చేస్తున్న వారికి జీతభత్యాలు లేవన్నారు. ఈ విధంగా అడుగడుగునా ఏ రంగం చూసిన నిధులు లేవంటున్న ముఖ్యమంత్రి వైభవంగా మరో కొత్త సిటీకి శంకుస్థాపన చేస్తామని ప్రజల్ని మోసం పుచ్చుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ నాయకుల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. వెంటనే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని వాటి విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page