Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsతెలంగాణ ఉద్య‌మ క‌ళాకారుల వేదిక జిల్లాల క‌న్వీన‌ర్ల ఎన్నిక‌

తెలంగాణ ఉద్య‌మ క‌ళాకారుల వేదిక జిల్లాల క‌న్వీన‌ర్ల ఎన్నిక‌

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్య‌మ క‌ళాకారుల వేదిక జిల్లాల క‌న్వీన‌ర్ల ఎన్నిక‌

హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ :    తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లిలో సాంస్కృతిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వేముల యాదగిరి, కాంపల్లి సాయిలు అధ్యక్షత వహించగా అన్ని జిల్లాల కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి అన్ని జిల్లాల కన్వీనర్లను ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక వరంగల్ జిల్లా కన్వీనర్ గా కొయ్యడ రాజేష్, సిద్దిపేట జిల్లా కన్వీనర్లుగా స్వరూప రాణి, బాల్ లక్ష్మమ్మ, గజ్వేల్ కన్వీనర్లుగా యాదగిరి, చంద్రకళ, నాగర్ కర్నూల్ కన్వీనర్లుగా కాంపల్లి సాయిలు, మాడుగుల వెంకటయ్య, మెదక్ జిల్లా కన్వీనర్లుగా కొండల్, యాదగిరి, సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా రేణుక, భువనగిరి జిల్లా కన్వీనర్లుగా సుగుణమ్మ, లావణ్య, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా ఇందిరా లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కోశాధికారి చంద్రన్న ప్రసాద్, తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు కంచర్ల బద్రి, మహిళ వేదిక ప్రధాన కార్యదర్శి లావణ్యతో పాటు 50 మంది కళాకారులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page