Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsకళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – మంత్రి జూపల్లి కృష్ణారావు

కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – మంత్రి జూపల్లి కృష్ణారావు

📰 Generate e-Paper Clip

కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

– మంత్రి జూపల్లి కృష్ణారావు

ర‌వీంద్ర‌భార‌తి, జులై 5, అద్దం న్యూస్ :    తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించి కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని, వెంటనే సమగ్ర సాంస్కృతిక విధానం తీసుకురావాలని, జానపద అకాడమీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జానపద సకల కళల కళాకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో శ‌నివారం హైద‌రాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, జానపద కళాకారుల జాక్ చైర్మన్ మురళీధర్ దేశ్పాండే మాట్లాడుతూ.. 11 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వాలు కళాకారుల సమస్యలు చర్చించేందుకు ముందుకు రాలేదని తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం లో కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, గుర్తిపు కార్డు ఇవ్వాలని, కళాకారులకు పింఛన్లు ఇవ్వాలని, తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రవీంద్రభారతిలో ప్రజా కళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, డిమాండ్ చేశారు. కళాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంటే..భా‌షా సాంస్కృతిక శాఖ 11 ఏళ్లుగా నియంతృత్వం కొనసాగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ మాట్లాడుతూ… కేరళ, కర్ణాటక మాదిరిగా జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని, తెలంగాణ సినిమాను రూపుదిద్దాలని, హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ తెలంగాణ ఫిలిం ఆర్కేవ్స్ నెలకొల్పాలన్నారు. తెలంగాణలో ఆగష్టు 22 న జానపద దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కోరారు.

ధ‌ర్నా విష‌యం తెలుసుకున్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు క‌ళాకారుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ నేప‌ధ్యంలో క‌ళాకారులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. కళాకారుల సమస్యలు విని అతి త్వరలో తెలంగాణ సమగ్ర సాంస్కృతిక విధానం పై తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కళాకారుల సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం నుండి చోరవతీసుకుంటానని కళాకారులకు సత్వర న్యాయం చేస్తామ‌ని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది కళాకారులు హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page