పి అండ్ టి పార్క్‌లో ఇంజనీరింగ్ విభాగం పనులు పూర్తి చేయించాం
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 23, అద్దం న్యూస్ : పి అండ్ టి పార్క్‌లో ఇంజనీరింగ్ విభాగం పనులు పూర్తి చేయించామని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్‌లోని పార్కుల అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పి అండ్ టి సురభి పార్క్ లో ఇంజనీరింగ్ విభాగం ద్వారా పూర్తైన పనులను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ గురువారం బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, స్థానిక కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన పనుల్లో కాంపౌండ్ వాల్ రిపేర్లు, ఫెన్సింగ్, పెయింటింగ్, పార్క్ చుట్టూ మెష్ ఏర్పాటు వాకింగ్ కొరకు పాత్ వే పనులు పూర్తి చేయించామన్నారు. త్వరలో ఆహ్లాదకరమైన చక్కటి మొక్కలను ఏర్పాటు చేసి స్థానిక కాలనీ వాసులకు ఉపయోగకరంగా అందుబాటులోకి చేస్తామని అన్నారు. వాటితో పాటు తమకు అందిన ఫిర్యాదు మేరకు పార్కు ప్రాంగణంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు శాఖ వారిని కోరడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 7:30 గంటలకు పార్కు మూసివేయబడుతుందని, ఆ తరువాత పార్క్ ప్రాంగణంలో ఏమైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరిగితే వెంటనే స్థానికులు డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందచేయాలని కాలనీ వాసులకు కార్పొరేటర్ పావని సూచించారు. గత కొన్ని ఏళ్లుగా నిరూపయోగంగా పడి ఉన్న పార్కును, ఏ నాయకులు, అధికారులు పట్టించుకోలేదని, కార్పొరేటర్ పావని వినయ్ ప్రత్యేక దృష్టి వహించి చేపట్టిన చర్యలతో కాలనీకి ఒక పార్కు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు, కాలనీ వాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్, నేతలు సాయి కుమార్, జ్ఞానేశ్వర్, స్థానికులు శ్రీనివాస్, రాజశ్రీ, సువర్ణ, రాజేశ్వర్ రావు, అఖిల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply