దోమలు వృద్ధి కాకుండా ఎంటమోలజీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
– కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 26, అద్దం న్యూస్ : దోమలు వృద్ధి కాకుండా ఎంటమోలజీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. శనివారం ఎంటమోలజీ ద్వారా ఫాగ్ స్ప్రే వెహికల్, సిబ్బందికి డివిజన్‌లోని అధికంగా దోమలు ఉండే అశోక్‌నగర్ నాలా పరివాహక బస్తీలు, పలు చోట్ల నుండి తమకు అందిన ఫిర్యాదు మేరకు మస్కిటో ఫాగ్ స్ప్రే చేయాలని, సిబ్బంది చేసే ఫాగ్ స్ప్రే ను కార్పొరేటర్ పావని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, బస్తీల్లో వర్షపు నీరు, బురద చేరి దోమలు వృద్ధి చెంది ప్రజలకు హాని కారక రోగాలు రాకుండా ఉండేందుకు జిహెచ్ఎంసి ఎంటమోలజీ సిబ్బంది మస్కిటో ఫాగ్ స్ప్రే చేయాలని కార్పొరేటర్ ఎ.పావని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, బిజెవైఎం నాయకుడు జ్ఞానేశ్వర్, ఎంటమోలజీ సూపర్‌వైజర్ అజయ్, రమేష్, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply