Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADSIR కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి

SIR కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి

📰 Generate e-Paper Clip

SIR కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి
– మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్‌

హైద‌రాబాద్‌, జూన్ 29, ( అద్దం న్యూస్ ) : SIR కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లంద‌రూ భాగ‌స్వామ్యం కావాలని మాజీ కార్పొరేట‌ర్, తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన ప్ర‌త్యేక స‌మ‌గ్ర ఓట‌ర్ల ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా స్పెష‌ల్ ఇంటెన్సీవ్ రివిజ‌న్ ( SIR ) ఎన్యుమ‌రేష‌న్ ఫారంను సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లిలో సంబంధిత అధికారి నుంచి బాల్‌రాజ్‌గౌడ్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ… ప్రజలందరూ తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకుని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిచేసుకోవాలన్నారు. అనుమానాస్పద ఓటర్ల వివరాలు, స్థానికంగా నివసించని లేదా మరణించిన వారి వివరాలు, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటు హక్కు పొందిన అర్హుల వివరాలను సంబంధిత BLO, BLA లకు అందచేయాల‌న్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు డి.చంద్ర‌మోహ‌న్ గౌడ్ త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page