నాలాలో గ‌ల్లంతైన దినేష్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా, అత‌ని భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాలి – అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు MRPS నాయ‌కుల విన‌తి

నాలాలో గ‌ల్లంతైన దినేష్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా, అత‌ని భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాలి

– అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు MRPS నాయ‌కుల విన‌తి

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 16, అద్దం న్యూస్ :      ఈ నెల 14వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో కురిసిన‌ భారీ వ‌ర్షానికి ముషీరాబాద్ డివిజ‌న్ వినోభాన‌గ‌ర్ నాలాలో జేరిపోతుల దినేష్ అలియాస్ స‌న్ని ( 25 ) గ‌ల్లంతైన సంగ‌తి విదిత‌మే. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు మంగ‌ళ‌వారం వినోభాన‌గ‌ర్‌లోని దినేష్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు దినేష్ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంఆర్‌పిఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు గండి కృష్ణ మాదిగ మాట్లాడుతూ…. నాలాలో దినేష్ కొట్టుకుపోయి మూడు రోజుల‌వుతున్నా ఇంకా ఆచూకి ల‌భించ‌లేద‌న్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. దినేష్ భార్య రాజమణి ( national worker welfare trust. School ) లో అనాధ అని అన్నారు. దినేష్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని, దినేష్ భార్య‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని, ప్రభుత్వం ద్వారా డబల్ బెడ్ రూమ్ వెంటనే మంజూరు చేయాలని అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ను కోరామ‌న్నారు. ఇందుకు అద‌న‌పు క‌లెక్ట‌ర్ సానుకూలంగా స్పందించార‌న్నారు. దినేష్ కుటుంబానికి న్యాయం చేస్తామ‌ని హామి ఇచ్చార‌ని గండి క్రిష్ణ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఆర్‌పిఎస్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్ గ‌జ్జ‌ల రాజ‌శేఖ‌ర్ మాదిగ‌, సీనియ‌ర్ నాయ‌కుడు చిలుక ఎల్ల‌య్య మాదిగ‌, హైద‌రాబాద్ జిల్లా నాయ‌కుడు కెఎం.కృష్ణ మాదిగ‌, ద‌శ‌ర‌థ్ మాదిగ‌, గోపి మాదిగ‌, నేష‌న‌ల్ వ‌ర్క‌ర్ వెల్ఫేర్ ట్ర‌స్ట్ ఫీల్డ్ ఆఫీస‌ర్ ఫాతిమా, న‌వ‌నీత త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page