Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadకార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి – పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష,...

కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి – పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్‌, నాగ‌రాజు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ :    రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టేలా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌వి.శ్రీకాంత్‌, పొడపంగి నాగ‌రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రభుత్వం విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించి వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం మూడువేల పై చిలుకు ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందుతుందని ఆరోపించారు. చట్టం ప్రకారం 25 శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని ఉన్నప్పటికి ఏ ఒక్క పాఠశాలలో అమలు కావడం లేదన్నారు. విద్యా వ్యాపారానికి పాల్పడుతున్న శ్రీచైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మరో పక్క ఇంజనీరింగ్ కళాశాలలు వేలాది రూపాయలను డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నాయని దీన్ని అరికట్టాలని, విద్యాశాఖకు తక్షణమే మంత్రిని నియమించి, ఖాళీగా ఉన్న విద్యాశాఖ అధికారుల పోస్టులను భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు జాతీయ నాయకుడు పి.మహేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, జె.రాజేశ్వర్, మంద నవీన్, సంతోష్, సహాయ కార్యదర్శిలు గౌతం కుమార్, జి.మస్తాన్, డి.ప్రణయ్, గుర్రం అజయ్, కోశాధికారి రానా ప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదారపు నాగరాజు, మర్రి మహేష్, సింహాద్రి, కార్తీక్, రాజేష్, గణేష్, జి.గౌతం, మునగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page