Saturday, September 19, 2026
No menu items!
HomeAPసింగ‌పూర్‌లోని ఓ స్కూల్‌లో అగ్ని ప్ర‌మాదం – చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్...

సింగ‌పూర్‌లోని ఓ స్కూల్‌లో అగ్ని ప్ర‌మాదం – చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

📰 Generate e-Paper Clip

 

సింగ‌పూర్‌లోని ఓ స్కూల్‌లో అగ్ని ప్ర‌మాదం

 అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స 

మన్యంలో పర్యటన ముగిసిన తరవాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం

సింగపూర్ :  సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page