ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి తొలి పూజ
హైదరాబాద్, మార్చి 14, అద్దం న్యూస్ : హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ రాంనగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొలి పూజా కార్యక్రమం ఉంటుందని శ్రీ హనుమాన్ ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గడ్డం నవీన్ లు తెలిపారు. శనివారం అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఏటా మాదిరిగానే హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తొలి పూజను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిటీ సలహాదారులు తుడుం రాజు, ఉపాధ్యక్షుడు కలకోట అరుణ్, కోశాధికారి వివేకానంద, కార్యదర్శులు ఎర్రర్ల సతీష్, మేకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply