Saturday, September 19, 2026
No menu items!
HomeCrime Newsమ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డిపిన ఐదుగురికి జైలు

మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డిపిన ఐదుగురికి జైలు

📰 Generate e-Paper Clip

మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డిపిన ఐదుగురికి జైలు

హైద‌రాబాద్‌, జూన్  5, ( అద్దం న్యూస్ ) :  మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డిపిన ఐదుగురికి పదవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు జైలు శిక్ష‌ల‌ను విధించింది. ఈ మేర‌కు హైదరాబాద్ చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏడుకొండలు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… శుక్ర‌వారం సాయంత్రం చిక్క‌డ‌ప‌ల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో త‌నిఖీలు చేశామ‌న్నారు. మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డుపుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని త‌నిఖీలు చేయ‌గా, మ‌ద్యం సేవించిన‌ట్టు గుర్తించారు. న‌ల్గొండ‌కు చెందిన‌ కొర్రా రాము ( 30 ), రామ్‌న‌గ‌ర్‌కు చెందిన బి.శంకర్ ( 50 ), తిరుమ‌ల‌గిరికి చెందిన భాస్కర్ ( 36 ), కాచిగూడ‌కు చెందిన బిధార్ కిషోర్ ( 44 ), మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన ఎమ్.నరేష్ ( 40 ) లను పదవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ( మద్యం తాగి వాహనం నడిపిన కేసుల–డిడి ) కోర్టు ఎదుట హాజ‌రుప‌రిచారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పదే పదే పట్టుబడిన (05) మంది వ్యక్తులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. రెండవసారి పట్టుబడిన వారికి రూ.7,300 ల‌ జరిమానా, మూడవసారి పట్టుబడిన ప్రతి ఒక్కరికీ రూ.10,100 ల‌ జరిమానాతో పాటు నేర తీవ్రతను బట్టి వరుసగా ( 2 ) రోజులు, ( 4 ) రోజులు, ( 8 ) రోజుల జైలు శిక్షల‌ను కోర్టు విధించింది. పౌరులందరూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏడుకొండలు సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page