చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
హైదరాబాద్, డిసెంబర్ 19, అద్దం న్యూస్ : అమావాస్య సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. చిక్కడపల్లి వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని పేదలకు భోజనం వడ్డించారు. నరసింహారావు, తమ్మన వేణు గోపాలరావు, రవితేజ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్, సీనియర్ నేతలు దామోదర్, శ్రీకాంత్, సంఘ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి మేష్, కోశాధికారి రవీందర్, సింగారపు రమేష్ సభ్యులు, మామిండ్ల శ్రీనివాస్, గంప బిక్షపతి, ఎం.సురేందర్ గుప్తా, కెవివి.ప్రసాద్ రావు, చొల్లేటి శ్రీనాథ్, చేపూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply