Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADమాజీ కార్పొరేటర్ ఎ.పావని, వినయ్ కుమార్ దంప‌తుల హౌస్ అరెస్ట్‌

మాజీ కార్పొరేటర్ ఎ.పావని, వినయ్ కుమార్ దంప‌తుల హౌస్ అరెస్ట్‌

📰 Generate e-Paper Clip

మాజీ కార్పొరేటర్ ఎ.పావని, వినయ్ కుమార్ దంప‌తుల హౌస్ అరెస్ట్‌

హైదరాబాద్, మార్చి 23, అర్థం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంప‌తుల‌ను సోమవారం ఉదయం వారి నివాసం వద్ద ముషీరాబాద్ పోలీసు అధికారులు హౌస్ అరెస్టు చేశారు. అవినీతి, అరాచక పాలన, కమీషన్ల రాజకీయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలను భ్రష్టు పట్టించిన ఖాన్ గ్రెస్ ( కాంగ్రెస్ ) పార్టీ విధానాలను ఖండిస్తూ బిజెపి రాష్ట్ర‌ పార్టీ పిలుపు మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చంద‌ర్‌రావు ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ఇంటికి వెళ్లిన పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు.

        ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… అవినీతి ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన ఉద్యమాలను అణచివేసే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే వరకు బిజెపి న్యాయ పోరాటం ఆగదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన బూటకపు వాగ్దానాల పై ఇక ముందు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అసెంబ్లీ, మినిస్టర్ క్వార్టర్స్‌తో పాటు గాంధీభవన్‌ను సైతం ముట్టడిస్తామని ఎ.వినయ్ కుమార్ హెచ్చరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page