...

బాపునగర్ శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని

 శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని

ముషీరాబాద్‌, ఏప్రిల్ 18, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజక‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపున‌గ‌ర్‌లో గ‌ల శ్రీ శ్రీ శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవి ఆల‌య 42వ వార్షికోత్స‌వ వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన శ్రీ శివ పార్వతుల కళ్యాణాన్ని తిల‌కించారు. ఆలయ పూజారులు మాజీ కార్పొరేటర్ దంపతులను సన్మానించి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రావు, సాయి కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ జి.దామోదర్, అధ్యక్షుడు సదానంద్‌, ఆలయ కమిటీ సభ్యులు రాజు, సురేందర్ రెడ్డి, సురేష్, అశోక్, బబ్బీ, గణేష్, భక్తులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.