శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఎ.పావని
హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఆలయాలు, కాలనీలు, అపార్ట్‌మెంట్స్, బస్తీల్లో శ్రీ రామ నవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని హాజరయ్యారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో, వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో, చిక్కడపల్లి హనుమాన్ దేవాలయం, జ్ఞాన మందిర్‌లో, గిరి నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో, ఆంధ్రాకేఫ్ సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో, సిద్ధంశెట్టి అపార్ట్‌మెంట్స్, బాపూనగర్, గాంధీనగర్ స్ట్రీట్ నంబర్ 12లో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న పావని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బిజెపి సీనియర్ నేతలు దామోదర్, పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. ఆమెతో పాటు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, శివ కుమార్, నీరజ్, జ్ఞానేశ్వర్, శశికాంత్, సాయి గౌడ్, లక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply