నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, జూన్ 8, ( అద్దం న్యూస్ ) : జిహెచ్ఎంసి కార్పొరేటర్ నిధులు రూ. 2 కోట్లల్లో భాగంగా రూ.10 లక్షల రూపాయలతో ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ గతంలో మాల బస్తీలో క్రమమైన నూతన సిసి రోడ్డు పనులను సోమవారం డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని పరిశీలించారు. చాలా సంవత్సరాల క్రితం మాల బస్తీలో వేసిన షాబాద్ బండలు పూర్తిగా దెబ్బతిని నడవలేని పరిస్థితి ఏర్పడిందని, బస్తీ ప్రజలు తమకు చేసిన ఫిర్యాదు మేరకు నూతన ససి రోడ్డు నిర్మాణం కోసం గతంలో కార్పొరేటర్ నిధులు కేటాయించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ పావని తెలిపారు.
సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించి, బస్తీ వాసులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేసి రోడ్డు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్ రావు, సీనియర్ నాయకులు దామోదర్, మదన్మోహన్, అరుణ్ కుమార్, గోపి, శివ కృష్ణ, బస్తీ నాయకులు జి.ఎస్.మధుసూదన్, జి.విజయ్ కుమార్, సునీల్ కుమార్, రమేష్, రాహుల్ బస్తీ మహిళలు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply