నూత‌న సిసి రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించిన మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

నూత‌న సిసి రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించిన మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

హైదరాబాద్, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి వివేక్‌న‌గ‌ర్ స‌మీపంలోని పెండెకంటి లా కాలేజీ, ఆంధ్ర విద్యాల‌యం వీధిలో కార్పొరేట‌ర్ ఫండ్స్ కింద మంజూరైన కోటి రూపాయ‌ల్లో భాగంగా రూ. 12 ల‌క్ష‌ల నిధుల‌లో గ‌తంలో ప్రారంభించిన నూత‌న సిసి రోడ్డు నిర్మాణం ప‌నులు బుధ‌వారం మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని ప‌రిశీలించారు. జిహెచ్ఎంసి వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్‌, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, స్థానికులతో కలిసి ప‌నుల‌ను పావ‌ని పరిశీలించారు. స్థానికంగా దుకాణం దారులకు, పాదచారులకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని అధికారులకు మాజీ కార్పొరేట‌ర్‌ పావ‌ని సూచించారు.

రానున్న‌ 15 రోజుల్లో నూతన సిసి రోడ్డు ప‌నుల‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మాజీ కార్పొరేటర్ స్థానికులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, సాయి కుమార్, సత్యేంధర్, ప్రశాంత్, స్థానికులు శాలిని, తులసి, రాజు, కె.శ్రీకాంత్, మల్లేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page