హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం పలికిన మాజీ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ : హైదరాబాద్‌లో గురువారం శ్రీ హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర ఘనంగా జరిగింది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ బిజెవైఎం కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు స్వాగతం తెలిపేందుకు వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ముఖ్య అతిథులుగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభాయాత్రలో వెళ్తున్న హనుమాన్ విగ్రహాలపై, భజరంగ్ దళ్ కార్యకర్తలపై పూలు చల్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, సాయి తరుణ్, భాను, సాయి తేజ, క్రాంతి, వరుణ్, చింటు, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, శ్రీకాంత్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, మదన్మోహన్, సాయికుమార్, లక్ష్మి, పూర్ణ, అనూష, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply