ముషీరాబాద్, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యుడు, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్‌తో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవలు చేయాలని కోరారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేషం మల్లేష్, నాయిని దేవేందర్ రెడ్డి, సిరిగిరి శ్యామ్, కల్వగోపి, జంగం అరుణ్ తదితరులున్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను పరామర్శించిన మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి
RELATED ARTICLES

