హైదరాబాద్, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, మహిళలపై దాడులు జరిగిన తర్వాత స్పందించడం, నిందితులను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరవృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి అన్నారు. గురువారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇంట్లోనే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాలు, రోడ్లు, ప్రజా రవాణా, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో కూడా భద్రత లేకపోవడం ఆవేదన కలిగిస్తుంది అని అంటూ మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది అని ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐద్వా, ఎస్ఎఫ్ఎ ప్రశ్నించారు. దేశంలో మహిళ పై ప్రతి 18 నిముషాలకు ఒక రేప్ కేసు నమోదు అవుతున్నది అని మహిళలపై జరిగే లైంగిక దాడుల్లో బీజేపీపాలిత రాష్ట్రాలే ముందుభాగాన ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు భయపడకుండ స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే హక్కును కల్పించాలని కోరారు. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, మహిళలపై హింసకు దారితీస్తున్న మూల కారణాలను గుర్తించి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి. పాఠశాలలు, కళాశాలల్లో స్త్రీ – పురుష సమానత్వం, మహిళలను గౌరవించే సంస్కృతి, మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని ఉన్న కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పోలీస్ పెట్రోలింగ్ను పటిష్టం చేసి, విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లెనిన్, భారత్, ప్రవీణ్, కార్తీక్ సాయి తదితరులు పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు, దాడులు అరికట్టాలి – ఎస్ఎఫ్ఐ
RELATED ARTICLES

