Sunday, September 27, 2026
No menu items!
HomeGREATER HYDERABADకొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ మోతె...

కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించిన మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

తార్నాక‌, , సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) :   స్వాతంత్య్ర‌ సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తార్నాకలోని తమ నివాసంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతె శోభన్ రెడ్డి లు హాజ‌రై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్వాతంత్య్ర‌ సమరంలో పాల్గొని, అనంతరం తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, చేనేత కార్మికుల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం ఆయన జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సమాజంలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పదవులు, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page