మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జయంతి
– పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు
హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) : తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జయంతి కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి శ్యామ్, రేషం మల్లేష్ ల ఆధ్వర్యంలో జరిగిన నాయిని జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంనగర్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై నాయిని చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు నాయిని దేవేందర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డేగల బిక్షపతి యాదవ్, కొండ సహదేవ్, కల్వగోపి, ముత్యం బాల్‌రాజ్‌గౌడ్, బూడిద లక్ష్మణ్ గౌడ్, గజ్జల సూర్యనారాయణ, సదా, కల్పన, రేణుక, రేఖ, తిరుమల, అనురాధ, మేరి, నక్క మహేందర్ గౌడ్, బల్లెకరి రమేష్, సోను తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply