...

విఎస్‌టి పార్కులో ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరం

విఎస్‌టి పార్కులో ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరం

హైద‌రాబాద్‌, జూలై 4, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్ విఎస్‌టి పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో శ‌నివారం ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరం జ‌రిగింది. ప‌ద్మావ‌తి హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ శిబిరంలో డ‌యాబెటిక్ తో ఉన్న వాకర్ల‌కు ఉచితంగా వైద్యాన్ని అంద‌చేసి, మందుల‌ను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా విఎస్‌టి పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కందూరి కృష్ణ మాట్లాడుతూ… ప్ర‌స్తుత రోజుల్లో చాలా మంది డ‌యాబెటిక్‌తో ఇబ్బందులుప‌డుతున్నార‌న్నారు. వారి కోస‌మే ఉచిత డ‌యాబెటిక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్కు స‌భ్యులు ముర‌ళీధ‌రుడు, జైహింద్, సాయి, అనిల్‌, మ‌ధుక‌ర్‌, కోటేశ్వ‌ర‌రావు, ఆంజ‌నేయులు, న‌ర్సింగరావు, వెంక‌ట్ రెడ్డి, వైద్య సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.