తలారి వినోద్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో
అయ్యప్ప స్వాములకు ఉచితంగా పడి పూజా సామాగ్రి పంపిణీ

హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన తలారి వినోద్ ముదిరాజ్ గురు స్వామి, తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు ఉచితంగా పడి పూజా సామాగ్రిని అందచేస్తున్నారు. గత 25 సంవత్సరాలకు పైగా వారు ఈ సేవలను అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు అందచేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం అడిక్‌మెట్‌లో అయ్యప్ప భక్తులకు అయ్యప్ప పడి పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రిని పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై స్వాములకు పడి పూజా సామాగ్రిని అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… వినోద్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో సుమారు రెండున్నర దశాబ్దాలుగా అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు ఉచితంగా పడి పూజా సామాగ్రిని అందచేయడం గొప్ప విషయమన్నారు. తలారి వినోద్ ముదిరాజ్ గురు స్వామి మాట్లాడుతూ… పడి పూజ చేయడానికి తనకు జరిగిన ఇబ్బందులు వేరే స్వాములకు రాకూడదనే మంచి ఉద్ధేశ్యంతో ప్రతి ఏటా సామాగ్రిని నూతనంగా కొనుగోలు చేస్తూ స్వాములు నిర్వహించే మహాపడిపూజలకు ఉచితంగా అందచేస్తున్నానని తెలిపారు. నెల రోజుల పాటు పడి పూజా సామాగ్రిని అందచేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుడు ముఠా జై సింహ, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పులిగిల్లి శ్రీధర్ చారి, శ్యామ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ప్రవీణ్ ముదిరాజ్, బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply