Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరం

ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరం

📰 Generate e-Paper Clip

లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో
ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరం

హైద‌రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, నివి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని మహిళా భవన్‌లో ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ తో కలిసి తమ నివి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మహిళలకు స్వయం ఉపాధి రూపకల్పనకు తోడ్పాటును కల్పిస్తూ వారికి ఉచితంగా టైలరింగ్, మగ్గం, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లను అందచేసారు.

ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా అనేక మంది మహిళలు స్వయం ఉపాధి ఏర్పరచుకొని వారి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకుంటున్నారని తెలిపారు. అందుకు మహిళా సాధికారతతో సేవలందించేందుకు ఎల్లపుడూ ముందు ఉండే లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుండి ప్రారంభమయ్యే ఉచిత జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు చంద్రమోహన్, ఐపిపి సెరిపల్లి గణేష్, ప్రవీణ్, విజయేంధర్, కాసం శ్రీనివాస్, నాగరాజు, హేమంత్, పవన్, జ్యూట్ బ్యాగ్ ప్రాజెక్టు చైర్మన్ పవిత్ర, బిజెపి నేతలు, దామోదర్, పరిమల్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page