Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADనిరాశ్రయులకు ఉచితంగా భోజనం

నిరాశ్రయులకు ఉచితంగా భోజనం

📰 Generate e-Paper Clip

అప్స స్వ‌చ్ఛంద‌ సంస్థ, సర్వ్ నీడీ సంస్థ ఆధ్వ‌ర్యంలో నిరాశ్రయులకు ఉచితంగా భోజనం

క‌వాడిగూడ‌, మే 19, ( అద్దం న్యూస్ ) :   వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు జ‌రుగుతున్న సంద‌ర్భంగా అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌ర్వ్ నీడి సంస్థ స‌హ‌కారంతో నిరాశ్ర‌యుల‌కు ఉచితంగా భోజ‌నం వ‌స‌తి క‌ల్పించారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడ డివిజ‌న్ దోమ‌ల‌గూడ‌లోని బండాన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో 100 మందికి ఉచితంగా భోజనాలు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా సర్వ్ నీడీ వ్యవస్థాపకుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్ధి దశ నుండి సేవా భావాన్ని అలవ‌ర్చుకోవాల‌ని, చెడు వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండాల‌న్నారు. మా సంస్థ వృద్దుల వసతి అనాధ‌ పిల్లకు ఉచిత విద్య సహాయం చేయడమే కాకుండా ప్రతి రోజు 2000 వేల మంది నిరాశ్రయులకు ఉచితంగా భోజనం వసతి కలిపిస్తున్నామ‌న్నారు.

బిజెపి నాయ‌కుడు కుమార్ గౌడ్ మాట్లాడుతూ… అప్స స్వ‌చ్ఛంద‌ సంస్థ, సర్వ్ నీడీ సంస్థ లాంటి సంస్థలు వేసవి శిక్షణ శిబిరం లాంటి కార్యక్రమాలను నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ సీనియ‌ర్ కో–ఆర్డినేట‌ర్ బొట్టు ర‌మేష్ మాట్లాడుతూ… విద్యార్థులు నైపుణ్యతతో పాటు క్రీడల్లో రాణించాల‌ని, యోగ లాంటివి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అప్స స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు శ్రావ‌ణి, లావ‌ణ్య‌, స‌ర్వ్ నీడి సంస్థ ప్ర‌తినిధులు జూలీన‌, సిరాజ్‌, స‌త్య‌నారాయ‌ణ‌, మ‌ణికంఠ‌, అంకితం ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు తిరుప‌తి, బ‌స‌వ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page