Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅక్రమ నిర్మాణాన్ని కూల్చిన జిహెచ్ఎంసి అధికారులు

అక్రమ నిర్మాణాన్ని కూల్చిన జిహెచ్ఎంసి అధికారులు

📰 Generate e-Paper Clip

అక్రమ నిర్మాణాన్ని కూల్చిన జిహెచ్ఎంసి అధికారులు

న‌ల్ల‌కుంట‌, మే 20, ( అద్దం న్యూస్ ) :  జిహెచ్ఎంసి అంబ‌ర్‌పేట‌ టౌన్ ప్లానింగ్ అధికారులు నల్లకుంట పాత రామాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాన్నికూల్చే ప‌నుల‌ను బుధ‌వారం చేప‌ట్టారు. ఓ వ్య‌క్తి త‌న భ‌వ‌నం పై అక్ర‌మ నిర్మాణాన్ని, సెల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేశాడు.

ఆ అక్ర‌మ నిర్మాణాన్ని కూల్చి, సెల్ ట‌వ‌ర్‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ (NCA) ఆధ్వ‌ర్యంలో జిహెచ్‌ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారును గ‌త నెల 21వ తేదీన‌, గ‌త నెల 4వ తేదీన జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌ మారుతి దివాకర్ ను, గ‌త నెల 13వ తేదీన ప్ర‌జావాణిలో ఫిర్యాదులు, విన‌తి ప‌త్రాల‌ను ఇచ్చారు. దీనికి సంబంధించి స్పందించిన అధికారులు బుధ‌వారం అక్ర‌మ నిర్మాణంతో పాటు సెల్ ట‌వ‌ర్‌ను తొల‌గింపు ప‌నుల‌ను చేప‌ట్టారు. ఆ భ‌వనాన్ని సీజ్ చేస్తున్న‌ట్టు అధికారులు బ్యాన‌ర్ క‌ట్టారు. నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయుడు, డాక్టర్ జై సూర్య, రాజీవ్ కుమార్, శ్రీనివాస్ రావు, అశ్విన్, భవాని శంకర్, వీరయ్య, హరి కుమార్, శ్రీనాథ్ తదితరులు మాట్లాడుతూ… అక్రమ నిర్మాణం కూల్చడం ప్రారంభించిన జిహెచ్ఎంసి అధికారులకు నల్లకుంట సిటిజన్స్ అసోసియేషన్ ( NCA ) అభినందనలు తెలియజేస్తున్నదన్నారు. అక్రమ నిర్మాణాలను, సెల్ టవర్లను వీలైనంత తొందర తొలగించడం పూర్తి చేయాలని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page