Thursday, November 19, 2026
No menu items!
Homedevotionalక‌మ‌నీయంగా కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి కల్యాణోత్సవం

క‌మ‌నీయంగా కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి కల్యాణోత్సవం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం బుధ‌వారం ఐదో రోజుకు చేరింది. ఇందులో భాగంగా వేదపఠనం, మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం, భక్తిగీతాలు, వీణా వాయిద్యం, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.

 రేజింతల్ శ్రీ సిద్ధివినాయకస్వామికి భక్తులచే కోటిగరికార్చన నిర్వహించారు. కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్‌కు చెందిన శ్రీ సర్వేశానందస్వామి, శ్రీ సాక్షిరూపానందస్వామి పీఠాధిపతులుగా పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తంగిరాల మాధవి దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రాంగణంలోని బంగారు శివలింగం వద్ద 108 మందితో పంచహారతులు నిర్వహించారు. మూషిక వాహనంపై కాజీపేట గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టారు.బ్రహ్మశ్రీ డా. కాకునూరి సూర్యనారాయణమూర్తి ప్రవచనాన్ని చెప్పారు. పీఠాధిపతుల అనుగ్రహభాషణం, ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతులు, భక్తుల సమక్షంలో సామూహిక కార్తీక దీపారాధన నిర్వహించారు. సప్తహారతి, మహానీరాజనం, గురువందనం, అతిథుల సత్కారం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పేరణి లాస్యం, జానపద నృత్యం, ఫ్యూజన్ నృత్యం తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page