Saturday, September 19, 2026
No menu items!
HomeNationalఐటి కంపెనీల‌కు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు

ఐటి కంపెనీల‌కు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు

📰 Generate e-Paper Clip

ఐటి కంపెనీల‌కు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు

వెబ్ డెస్క్‌, అద్దం న్యూస్ :   తెలంగాణ‌లోని టూ టైర్ న‌గ‌రాల్లో ఉన్న‌ ఐటి కంపెనీల‌కు మరో మూడేళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీలో హ‌రీష్‌రావు మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాలో కూడా ఐటీని విస్తరించామ‌న్నారు. అందులో భాగంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్‌, సిద్దిపేట త‌దిత‌ర‌ జిల్లాలో ఐటీ టవర్లు నిర్మించామన్నారు. వాటిల్లో స్థానిక యువ‌త‌కు ఉద్యోగాల‌ను ఇచ్చామ‌న్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఐటీ టవర్లను నిర్లక్ష్యం చేస్తుంది.. దాని వల్ల చాలా కంపెనీలు వెళ్ళిపోతున్నాయన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్‌లో కూడా గతంలో 18 కంపెనీలు పని చేస్తుంటే.. ఇప్పుడు 11 కంపెనీలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. కనీసం ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటి కంపెనీల‌కు ఇంటర్నెట్ కూడా కట్ చేశారన్నారు. ఐటీ టవర్‌లో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 4 నెలల నుండి జీతాలు ఇవ్వలేదన్నారు. వారికి జీతాలు ఇచ్చి,, ఐటి కంపెనీల‌ను ప్రోత్స‌హించి, అక్క‌డ స్థానికంగా ఉండే యువ‌త‌కు ఉద్యోగ‌వ‌కాశాల‌ను క‌ల్పించాల‌ని అసెంబ్లీ వేదిక‌గా మంత్రిని హ‌రీష్‌రావు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page