బిజెపి ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా గడ్డం నవీన్
హైదరాబాద్, జూన్ 26, ( అద్దం న్యూస్ ) : బిజెపి ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన గడ్డం నవీన్ నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. గడ్డం నవీన్ 2006లో హిందు వాహినిలో పని చేశారు. 2009 లో బిజెపి బూత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత బిజెవైఎం రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా, రాంనగర్ డివిజన్ బిజెవైఎం అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేశారు. అలాగే ముషీరాబాద్ అసెంబ్లీ బిజెవైఎం కన్వీనర్‌గా పని చేశారు. ప్రస్తుతం బిజెపి ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ… తనను బీజేపీ ఎస్సీ మోర్చ సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడిగా నియమించి, నాపై ఉంచిన నమ్మకానికి, మద్దతుకు ప్రతిఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేశారు. ఈ బాధ్యతను అప్పగించినందుకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్‌కు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు, బిజెపి సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్‌కు, బిజెపి ఎస్సీ మోర్చ తెలంగాణ అధ్యక్షుడు కాంతి కిరణ్‌లకు ధన్యవాదాలను తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతను వినయంతో, అంకితభావంతో స్వీకరిస్తున్నానని, పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, మన విలువలను నిలబెట్టడానికి నేను అవిశ్రాంతంగా కృషి చేస్తానన్నారు.![]()

![]()

