స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం నవీన్
హైదరాబాద్, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : సేవా పక్వాడ్‌లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం న్యూ అచ్చయ్యనగర్ బస్తీలో స్వచ్చ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్లను ఊడ్చారు. ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ… చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల నదులు, భూమి కలుషితమవుతాయన్నారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పర్యావరణానికి చాలా హానికరంగా మారాయన్నారు. ఈ కాలుష్యాన్ని తగ్గించి, మన పర్యావరణాన్ని కాపాడటానికి, చెత్తను సక్రమంగా నిర్వహించడానికి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. దేశాన్ని సుభిక్షంగా చేసేందుకే ప్రధాన మంత్రి మోడి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సతీష్, బాబుగౌడ్, జనార్దన్, తుడుం రాజు, జయపాల్, అరుణ్, కేశవ్, నర్సింగ్ రావు, రాకేష్, రాజు, గంగులు, లడ్డు యాదవ్, జాన్సన్, నరేష్, శంకర్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply