పారిశుద్ధ్య‌ కార్మికులతో హోలి ఆడిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో శుక్ర‌వారం హోలీ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జిహెచ్ఎంసి మ‌హిళా పారిశుద్ధ్య కార్మికుల‌తో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హోలీ ఆడారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… పేద, గొప్ప, కులం, మతం, చిన్న,పెద్ద ఆన్న తారత‌మ్యాలు లేకుండా ప్రేమ, అభిమానం, ఆప్యాయ‌తలకు ప్రతీకగా సప్తవర్ణ రంగులు ఒకరికొకరు పుసుకొనే వేడుక హోలీ అని అన్నారు. ఈ రంగుల హోలీ పండగ అందరి జీవితాలను సుఖసంతోషాలతో రంగుల మయం చేయాలని ఆశీస్తూ, అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుక‌ల్లో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి మ‌హిళా పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు విజయ్ కుమార్, నర్సింగ్ రావు, ఎస్ఎఫ్ఏలు రాజ్ కుమార్, సోమేష్, గోపాల కృష్ణ, శివ కుమార్, ఆనంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page