బస్తీలో పర్యటించిన గాంధీనగర్ కార్పొరేటర్
ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 1, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని పలు బస్తీల్లో స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సోమవారం పర్యటించారు. జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్‌తో కలిసి డివిజన్‌లోని దోభిఘాట్, వాల్మీకినగర్, మాల బస్తీ, శాంతి యువజన సంఘం, కెవిఎన్ చారి గల్లి, వివి గిరి నగర్ బస్తీల్లో కార్పొరేటర్ పావని పర్యటించారు. బస్తీల్లో షాబాద్ బండల ఏర్పాటుతో పాటు మరిన్ని బస్తీల్లో సిసి రోడ్లను ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, పనుల కొరకు నిధులను మంజూరు చేయించి త్వరలో పనులను చేపడతామని బస్తీ వాసులకు కార్పొరేటర్ పావని హామీ ఇచ్చారు. అలాగే షాబాద్ బండల, సిసి రోడ్ల, నిర్మాణంతో పాటు పలు బస్తీల ప్రజలు నూతన సివరేజి పైప్‌లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని చేసిన ఫిర్యాదు మేరకు త్వరలో నూతన పైప్‌లైన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులకు కార్పొరేటర్ పావని సూచించారు. డివిజన్‌లోని ప్రతి బస్తీలో పర్యటించి అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, బిజెపి నేతలు మహమూద్, మదన్మోహన్, నరసింహ, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, తరుణ్, బస్తీ వాసులు నగేష్, మల్లికార్జున్, రమేష్, మధు, మల్లేష్, పెంటయ్య, రాజు, కుమార్, మురళీ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply