Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadచిన్నారుల‌తో అక్ష‌రాభ్యాసం చేయించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

చిన్నారుల‌తో అక్ష‌రాభ్యాసం చేయించిన గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 14, అద్దం న్యూస్ :   వేసవి సెలవుల అనంతరం మొదలైన అంగన్‌వాడి కేంద్రాల్లో కొత్తగా చేరిన పిల్లలకు జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్‌లో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో శనివారం అమ్మఒడి.. అంగన్‌వాడి కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… అంగన్‌వాడిల్లో చిన్న పిల్లలకు మొదటి విద్యాభ్యాసం మొదలవుతుందని, పిల్లలకు విద్యతో పాటు ఆటలు, పాటలు, రైమ్స్ నేర్పడమే కాకుండా ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తారని అన్నారు. ప్రైవేటు ప్లే స్కూళ్ల‌కు మించి ఉచితంగా పిల్లలకు మంచి విద్యాభ్యాసాన్ని అంగన్‌వాడిలో అందచేస్తున్నారని అన్నారు. పిల్లలతో పాటు గర్భిణులకు, బాలింతలకు అంగన్‌వాడి ద్వారా పౌష్టికాహారం అందుతుందని.. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, అంగ‌న్‌వాడి సూప‌ర్‌వైజ‌ర్ జ్యోతి, అంగ‌న్‌వాడి టీచర్లు వై.నర్సమ్మ, డి.ప్రమీల, కౌసర్ బేగం, సబిత, ఆయా మాణిక్యమ్మ, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page