ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గంగపుత్రులు సత్తా చాటాలి
» తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర
హైదరాబాద్, జనవరి 7, అద్దం న్యూస్ : ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో గంగపుత్రులు సత్తా చాటాలని, అందుకోసం గంగపుత్రులందరూ కృషి చేయాలని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర లు పిలుపునిచ్చారు. గంగపుత్ర చైతన్య సమితి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర అధ్యక్షతన గంగపుత్ర సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ లకు ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది. ప్రారంభోపన్యాసం చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ పూస సత్యనారాయణ గంగపుత్ర విచ్చేసిన బంధువులకు శుభాకాంక్షలు తెలిపి అతిథులను, మండల, జిల్లా, రాష్ట్ర గంగపుత్ర నాయకులను ఆహ్వానించారు.
తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ… గంగపుత్ర జాతి రాజకీయంగా ఎదగాలని, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చే వారికి అండగా ఉంటానని, గెలిచిన వారికి శుభాకాంక్షలు పోటీ చేసిన వారికి అభినందనలు తెలిపారు. అలాగే నేను పుట్టిన మత్స్యకార కులానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని, బీసీ ఏ రిజర్వేషన్ లోకి ఇతర కులాలు రాకుండా అడ్డుగోడలా ఉంటానని, కులవృత్తికి రక్షణ కల్పించే విధంగా త్వరలో ముఖ్యమంత్రితో కుల సంఘాల నాయకులను కూర్చోబెడతానని, గంగపుత్ర ఆత్మగౌరవ భవనం త్వరలో పూర్తయ్యే విధంగా, గంగపుత్ర కార్పోరేషన్ కు నిధులు కేటాయింపజేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా గంగపుత్రులు రాజకీయ చైతన్యంతో పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఓడిన వారికి అనుభవంగా తీసుకుని భవిష్యత్తులో మరింత ఎదిగేందుకు కృషి చేయాలని, గెలిచిన వారు దొరికినటువంటి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీసీలలో రిజర్వేషన్ విభజన జరగపోవడం వలన బీసీలలోని పెద్ద కులాల చేతులలోనే ఎక్కువ మంది గంగపుత్రులు ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాబోయే ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసి గంగపుత్రుల దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం గంగపుత్ర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. కార్పొరేషన్‌కు వెంటనే చైర్మన్ ను ప్రకటించి, వెయ్యి కోట్ల నిధులు కేటాయించి గంగపుత్రుల అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే గంగపుత్ర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి వెంటనే పదికోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఎదగడం ద్వారా కులానికి, ప్రభుత్వానికి వారధులుగా ఉండాలని కుల నాయకులకు సూచించారు. సాంప్రదాయ మత్స్యకారులమైన బెస్త గూండ్ల గంగపుత్రుల కులవృత్తి అక్రమ జీవోలతో అఫీషియల్ గా దోపిడికి గురౌతున్నదని, ప్రత్యేక రక్షణ చట్టం ద్వారా కులవృత్తికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అత్యంత వెనుకబడిన సంచార, అర్థ సంచార, బిక్షాటన కులాలున్న బీసీ ఏ రిజర్వేషన్ కేటగిరీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ఇతర కులాలను బీసీ ఏ రిజర్వేషన్ కేటగిరీలో చేర్చవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన, పోటీ చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, స్టీరింగ్ కమిటీ చైర్మన్ పూస సత్యనారాయణ గంగపుత్ర, ప్రధాన కార్యదర్శి కైరంకొండ నర్సింగ్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు చింతకింది రవి గంగపుత్ర, రాచకట్ల దీపక్ గంగపుత్ర, పూస శ్రీనివాస్ గంగపుత్ర, కోశాధికారి మానుకొల సురేష్ గంగపుత్ర, కార్యదర్శి ఎర్రబోయిన ప్రవీణ్, కుంట ప్రవీణ్ గంగపుత్ర, పూస రవి గంగపుత్ర శ్రీకాంత్ గంగపుత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు చెర్క అంజయ్య గంగపుత్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉట్నూర్ బాలయ్య గంగపుత్ర , సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బిజ్జి రాజయ్య గంగపుత్ర, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సిరికొండ రవీందర్ గంగపుత్ర, దావెల రవి గంగపుత్ర, గాజె నరేష్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply