హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు బాధితుడి నుంచి 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఏఈ టి.మనీషా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. అంబర్‌పేట్ నియోజకవర్గం గోల్నాక నెహ్రునగర్ వార్డ్ నంబర్ – 2లో జిహెచ్ఎంసి ఏఈ టి.మనీషా విధులను నిర్వహిస్తున్నారు. కొన్ని బిల్లులను ప్రాసెస్ చేసి సంబంధిత పై అధికారులకు పంపించడానికి అధికారికంగా సహాయం చేసేందుకు బాధితుడు ఏఈ మనీషాను కోరారు. దీంతో 20 వేల రూపాయల లంచం ఇవ్వాలని ఏఈ మనీషా కోరింది. అందుకు ఒప్పుకున్న బాధితుడు 5000 వేల రూపాయలు ఇచ్చాడు. మరో 15 వేల రూపాయలు ఇవ్వాలని కోరగా బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు సలహామేరకు 15000 వేల రూపాయలను సోమవారం గోల్నాక నెహ్రునగర్ జిహెచ్ఎంసి వార్డ్ నంబర్ – 2లో ఇస్తుండగా ఏసీబి అధికారులు రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా ఏఈ మనీషాను పట్టుకున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply