అరేబియన్ మండి హోటల్‌ను పరిశీలించిన జిహెచ్ఎంసి అధికారులు

హైదరాబాద్, సెప్టెంబర్ 11, అద్దం న్యూస్ : బిర్యానీలో బొద్దింక వచ్చిన అరేబియన్ హోటల్‌ను జిహెచ్ఎంసి అధికారులు పరిశీలించారు. సికింద్రాబాద్‌కు చెందిన సంతోష్, రాఘవ, ప్రశాంత్‌లు బిర్యానీ తినేందుకు ఈ నెల 9వ తేదీ రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం గోల్కొండ చౌరస్తాకు దగ్గర్లో ఉన్న అల్ సౌద్ బైత్ ఎ 1 అరేబియన్ మండి హోటల్‌కు వచ్చారు. బిర్యాని తింటుండగా బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో హోటల్ నిర్వాహకులను బాధితులు నిలదీశారు. హోటల్ నిర్వాహకులు బాధితుల పట్ల దురుసుగా మాట్లాడారు. దీంతో బాధితులు ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌లో, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బొద్దింకలో బిర్యానీ వచ్చిందని అద్దం న్యూస్‌తో పాటు పలు పత్రికల్లో వార్తలు ప్రచురణ అయింది. దీంతో జిహెచ్ఎంసి అధికారులు స్పందించి గురువారం అరేబియన్ మండి హోటల్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. హోటల్‌లోని కిచెన్‌లోని సిద్ధంగా ఉన్న చికెన్ తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. కొన్ని శాంపిల్స్‌ను తీసుకెళ్లారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply