టిడిపి నాయ‌కుడు పులి ప్ర‌దీప్ గౌడ్‌ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా హ‌నుమాన్ జెండా ఉత్స‌వం

టిడిపి నాయ‌కుడు పులి ప్ర‌దీప్ గౌడ్‌  ఆధ్వ‌ర్యంలో
ఘ‌నంగా హ‌నుమాన్ జెండా ఉత్స‌వం

హైదరాబాద్, ఏప్రిల్ 2, అద్దం న్యూస్ :   తెలుగుదేశం పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు పులి ప్ర‌దీప్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో హ‌నుమాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని బాకారం వ‌ద్ద హ‌నుమాన్ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పులి ప్ర‌దీప్ గౌడ్ జెండాను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… 2010లో తాను హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ హ‌నుమాన్ జెండాను ఏర్పాటు చేయించ‌డం జ‌రిగింద‌న్నారు. గ‌త 16 సంవ‌త్స‌రాలుగా ప్ర‌తి ఏడాది హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ జెండాను ఎగుర‌వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇదే ఒర‌వ‌డిని భ‌విష్య‌త్‌లో కూడా కొన‌సాగిస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల‌ నాయ‌కులు సురేంద‌ర్ రావు, ప్ర‌వీణ్ రెడ్డి, పాండు రెడ్డి, రాము గౌడ్‌, అశోక్‌గౌడ్‌, స‌తీష్ నేత‌, శేఖ‌ర్ నేత‌, ప్ర‌వీణ్ నేత‌, శివ గౌడ్‌, పులి సందీప్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page