...

కేంద్రం ప్రతిపాదించిన జిఎస్‌టి స్లాబు రేట్లు స్వాగతించదగినది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

కేంద్రం ప్రతిపాదించిన జిఎస్‌టి స్లాబు రేట్లు స్వాగతించదగినది

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :    జిఎస్‌టి స్లాబురేట్ల క్రమబద్ధీకరణ ప్రత్యేకంగా సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు మెరుగు పడతాయని, ఆర్థిక రంగాన్ని బలోపేతానికి దోహద పడుతుందని, కేంద్రం ప్రతిపాదించిన ఈ జిఎస్‌టి స్లాబు రేట్లు స్వాగతించదగినదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లో టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం ఆనందదాయకమైందని, చిన్నవ్యాపారులకు, రైతులకు, మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు యువతరానికి మేలు జరుగుతుందన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ( 2025 ) లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన జిఎస్‌టి స్లాబుల సవరణ, కొత్త ట్యాక్సులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తాయన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ ప్రస్తుతం ఉన్న బహుళ స్లాబ్‌లను ( 5, 12, 18, 28 శాతం ) రద్దు చేసి, కేవలం రెండు 5%, 18% స్లాబులుగా ప్రవేశ పెట్టారన్నారు.                                            దాంతో పాటు పానుమసాలా, పొగాకు, సిగరెట్ల వంటి అత్యంత విలాసవంతమైన వస్తువులపై 40 శాతంగా నిర్ణయించారన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువులైన తల నూనెలు, షాంపూలు, టూత్ పేస్టులు. సబ్బులు, బ్రష్ లు, షేవింగ్ క్రీములు మొదలైన వాటిపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం, అదే విధంగా పాలు, వెన్న, పాల ఉత్పత్తులు, వంట సామాగ్రి, డ్రైవర్లు కుట్టుమిషన్లు 12 నుంచి 5 శాతానికి తగ్గించడం, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వ్యక్తిగత ఆరోగ్య భీమా, జీవిత బీమా, వ్యక్తిగత బీమా మొదలైన వాటిపై 18 శాతం నుండి 0 శాతంగా ప్రాణాంతకమైన వ్యాధుల చికిత్స కోసం వైద్య పరికరాలపై, వాటికి ఉపయోగించే మందులపై 12 శాతం నుంచి 5 శాతం తగ్గించడం శుభ పరిణామమ‌న్నారు.  ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతున్న పేద మధ్య తరగతి సామాన్య ప్రజల జీవితాలలో వెలుగులు ప్రసరించే విధంగా జిఎస్టి కౌన్సిల్ నిర్ణయాలు ఉన్నాయని, ఈ నిర్ణయం స్వాగతించ దగినదని హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌డిఎ మిత్రపక్షం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండాల్సిందిగా సాయిబాబా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించదగిందని, ప్రతిపక్షాల వాదనలను పక్కన పెట్టాలని, ఈ నిర్ణయం వల్ల అంతిమంగా సామాన్య మధ్య తరగతి ప్రజలకు, చిన్నవ్యాపారులకు, రైతులకు, మహిళలకు యువతకు లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేసారన్నారు. ఈ నిర్ణయం వెనుక ఎన్‌డిఎ భాగస్వామ్య మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ప్రస్పుటంగా కనిపిస్తుంద‌ని సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.