Sunday, September 20, 2026
No menu items!
Homedevotionalవివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ఘ‌నంగా హ‌నుమాన్ జ‌న్మోత్స‌వం

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో ఘ‌నంగా హ‌నుమాన్ జ‌న్మోత్స‌వం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, మే 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో హ‌నుమాన్ జ‌న్మోత్స‌వం గురువారం ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా సిందూర అభిషేకం, పంచామృత అభిషేకం, ఆకు పూజ‌లు, అర్చ‌న‌లు, సంస్కృతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ పూజ‌ల‌కు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్, ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్‌, ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహ‌ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు ప్ర‌త్యేక పూజ‌లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోతుల శ్రీకాంత్‌, మీడియా ఇన్‌చార్జ్ ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, నాయ‌కులు పున్న స‌త్య‌నారాయ‌ణ‌, ఆకుల శ్రీనివాస్‌, శ్రీధ‌ర్‌రెడ్డి, ప‌ద్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page