Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadబాల బాలిక‌ల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయ‌డానికి వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు దోహ‌దం – స‌బ్...

బాల బాలిక‌ల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయ‌డానికి వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు దోహ‌దం – స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్‌

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, మే 22, అద్దం న్యూస్ :    బాల బాలిక‌ల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయ‌డానికి వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు దోహ‌దం చేస్తాయ‌ని హిమాయ‌త్‌న‌గ‌ర్ ట‌పాల కార్యాల‌యం స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్ అన్నారు. అప్స స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో క‌వాడిగూడ‌లోని మున్సిప‌ల్ కాల‌నీలో వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు గురువారం ఘ‌నంగా ముగిశాయి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశానికి ముఖ్య అతిథిగా హిమాయ‌త్‌న‌గ‌ర్ ట‌పాల కార్యాల‌యం స‌బ్ పోస్ట్ మాస్ట‌ర్ సురేష్ గౌడ్ హాజ‌రై వేస‌వి శిక్ష‌ణ శిబిరాల్లో పాల్గొన్న బాల‌, బాలిక‌ల‌కు నోట్ పుస్త‌కాలు, పెన్నులు, పెన్సిళ్లను అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ… అప్స లాంటి స్వచ్ఛంద‌ సంస్థలు బాల బాలికల కోసం ఇలాంటి శిక్ష‌ణ శిబిరాల‌ను నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాల‌, బాలిక‌ల‌కు చెడు వ్య‌స‌నాల‌కు, మొబైల్ ఫోన్ల‌కు బానిస కాకుండా ఉండాల‌న్నారు. సుకన్య సమృద్ధి యోజన, మంత్లీ సేవింగ్ జన సురక మహిళా సమాన అకౌంట్, ప్రధాన మంత్రి జంధన్ యోజన త‌దిత‌ర పథకాల ప్రయోజనాలను స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. అనంతర అప్స స్వచ్ఛంద‌ సంస్థ సీనియ‌ర్ కో – ఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ… చిన్నతనము నుండి విద్య పై శ్రద్ధ వహించాలని, కస్టపడి చదివి రాబోవు తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో బాల, బాలికలు, అప్స స్వచ్ఛంద‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page