...

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో వైభ‌వంగా హ‌నుమాన్ జ‌యంతి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :   శ్రీ హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా డివిజ‌న్‌లోని వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో హ‌నుమాన్ జ‌యంతి వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఘ‌టాభిషేకం, పంచామృత‌, వివిధ ఫ‌ల ర‌స అభిషేకం, ఆకుపూజ‌, వ‌డ‌మాల పూజ‌లు త‌దిత‌ర పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌స్వామి వ్ర‌తం నిర్వ‌హించారు. ఈ పూజ‌లో ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ జాన‌కి సుధాక‌ర్ పాల్గొన్నారు. ఈ పూజ‌ల‌కు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్‌, మాజి ఎంపి అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌లు హాజ‌ర‌య్యారు. ఈ పూజ‌ల్లో ఆల‌య ఈవో మాచ‌ర్ల దేవ‌నాధం, మాజీ కార్పొరేట‌ర్ అరుణా జ‌యేంద‌ర్‌బాబు, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు. 

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో వైభ‌వంగా హ‌నుమాన్ జ‌యంతి

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.