Friday, September 18, 2026
HomeHyderabadడాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియ‌చేసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ

డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల సంతాపాన్ని తెలియ‌చేసిన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ

చండీగఢ్, జులై 1, అద్దం న్యూస్ :    డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రయ మంగ‌ళ‌వారం సంతాపాన్ని రాజ్ భ‌వ‌న్ నుంచి విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌చేశారు. ఐంద్ర జాలికుడిగా, విద్యార్థులకు, యువ కుటుంబాలకు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పట్టాభిరాం వివిధ రాష్ట్రాలకు చెందిన కొన్ని లక్షల మంది జీవితాలను నిలబెట్టారని వారి సేవలను హరియాణా బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ఆయ‌న‌ రాసిన ‘కష్టపడి చదవద్దు – ఇష్టపడి చదవండి’, ‘మైండ్ మేజిక్’, గుడ్ పేరెంట్’ వంటి డజన్లకొద్దీ పుస్తకాలు తెలుగు యువత జీవితాలకు శాశ్వతమైన దిక్సూచిలని, తెలుగుజాతి గర్వించదగిన డాక్టర్ పట్టాభిరామ్ మరణంతో వ్యక్తిత్వ వికాస రంగంలో ఒక శూన్యం ఏర్పడిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. డాక్టర్ పట్టాభిరామ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ తెలియజేసారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page